డోన్ పట్టణంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వైకాపా ఎన్నికల ప్రచారం
By
Published : Mar 30, 2019, 6:04 PM IST
బుగ్గన రాజేంద్రనాథ్ ప్రచారం
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. 8, 9, 10 వార్డుల్లో ఓటర్లను కలిశారు. నవరత్నాల హామీలను ప్రజలను వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. ప్యాపిలి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు ఇతర పార్టీ నాయకులు బుగ్గన సమక్షంలో వైకాపాలో చేరారు.