కర్నూలు పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ...జనాల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎమ్మిగనూరు ప్రాంతంలో వీధిలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. చేతులు, వీపు భాగాన తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపాలిటి సిబ్బంది ఇప్పటికైనా వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కర్నూలులో వీధి కుక్కల స్వైరవిహారం... ఇద్దరు పిల్లలపై దాడి
ఎమ్మిగనూరులో ఇద్దరు పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. చేతులు, వీపు భాగాన తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా... వీధి కుక్కలను నియంత్రించడంలేదని స్థానికులు వాపోతున్నారు.
Dogs attack two childrens