ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటేనే అమ్మ అని... అంటే ఎలా...! - milk

అమ్మతనానికి జాతులతో సంబంధం ఉండదు.... మనుషులు, జంతువులు, పక్షులు అనే వ్యత్యాసం కనిపించదు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవటమే మాతృ ప్రేమకు తెలిసిన భాష.... ఆ కరుణ హృదయానికి నిదర్శనంగా నిలుస్తోందీ శునకం. తన పిల్లలు చనిపోయినా... వేరే జాతి కూనలకు పాలిచ్చి పెంచుతోందీ మాతృమూర్తి.

కంటేనే అమ్మ అని... అంటే ఎలా...!

By

Published : Jul 5, 2019, 4:54 PM IST

కంటేనే అమ్మ అని... అంటే ఎలా...!

పంది పిల్లలనే తన బిడ్డలుగా సాకుతూ.. తన పిల్లలను వాటిలో చూసుకుని పాలిస్తూ... అమ్మతనానికి మారుపేరుగా నిలుస్తోందీ శునకం. కర్నూలు మాధవ్​ నగర్​లో పది రోజుల క్రితం ఓ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.... అవన్నీ అనారోగ్యంతో చనిపోయాయి. అప్పటి నుంచి జాతి బేధం పక్కన పెట్టి పంది పిల్లలకు తల్లి శునకం పాలిస్తూ జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆ వరాహం కూనలూ.... సొంత తల్లిలా శునకం వెనకే తిరగుతున్నాయి. ఇదంతా చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details