ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యులపై దాడిని ఖండిస్తూ ఈ నెల 18న నిరసన - కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్యుల నిరసన దీక్ష

వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈనెల 18న నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భారతీయ వైద్యుల సంఘం జాతీయ సాంస్కృతిక కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. జాతీయ స్థాయిలో వైద్య రక్షణ చట్టాన్ని భారతీయ శిక్షాస్మృతిలోకి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

వైద్యులపై దాడిని ఖండిస్తూ ఈ నెల 18న నిరసన
వైద్యులపై దాడిని ఖండిస్తూ ఈ నెల 18న నిరసన

By

Published : Jun 15, 2021, 4:31 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో భారతీయ వైద్యుల సంఘం జాతీయ సంస్కృతిక కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో వైద్య రక్షణ చట్టాన్ని భారతీయ శిక్షాస్మృతిలోకి చేర్చాలని అన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఐఎంఎ ఆధ్వర్యంలో ఈ నెల 16న సామాజిక మాధ్యమాల్లో అవగాహన, 17న ప్రజాప్రతినిధులకు వినతిపత్రం సమర్పణ కార్యాక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు...డాక్టర్ మధుసూదన్​రావు, అనిల్ కుమార్, విజయభాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details