''మమ్మల్నీ మనుషులుగా గుర్తించండి'' - kurnool
వైద్యో నారాయణో హరీ... అని తమను దేవుడుతో పోల్చనవసరం లేదనీ, కనీసం సాటి మనుషులుగా గుర్తిస్తే చాలంటా నంద్యాలలో వైద్యులు నిరసన చేపట్టారు.
మమ్మల్నీ సాటి మనిషులుగా గుర్తించండి
తరుచుగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్యులు గంట సేపు ధర్నా చేశారు. తమపై దాడి చేస్తే చాలా కేసులు తాము పెట్టగలరని, ఒక్కసారి కేసు పెడితే రోగికైనా, రోగి బంధువుకైనా నాన్ బెయల్ వారంట్ ఉంటుందని, కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. సాధారణ ప్రజలకు ఈ విధమైన కేసులున్నాయని తెలియకే తమపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. తమ రక్షణ కోసం ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే విధులు బహిష్కరించినట్లు చెప్పారు.