ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య కళాశాల అభివృద్దికి కృషి చేస్తా: ఎంపీ సంజీవ్​కుమార్ - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు వైద్య కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. వైద్య కళాశాలకు సూపర్ స్పెషాలిటీ విభాగంలో 5 కోర్సుల్లో 9 సీట్లు వచ్చాయని చెప్పారు.

ఎంపీని సన్మానిస్తున్న వైద్యులు
ఎంపీని సన్మానిస్తున్న వైద్యులు

By

Published : Jul 4, 2021, 5:23 PM IST

కర్నూలు వైద్య కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ. డాక్టర్.సంజీవ్ కుమార్ తెలిపారు. కళాశాలకు సూపర్ స్పెషాలిటీ విభాగంలో 5 కోర్సుల్లో 9 సీట్లు వచ్చాయన్నారు. త్వరలో మిగిలిన 3 కోర్సుల్లోనూ సీట్లు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కళాశాల వల్ల నిమ్స్ లాంటి సంస్థ కర్నూలుకు వచ్చినట్టే అని చెప్పారు. ఇందుకు కృషి చేసిన వైద్యులను ఎంపీ. అభినందించారు. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే రావాలని ఆయన ప్రజలను కోరారు. సూపర్ స్పెషలిటీ కోర్సుల్లో సీట్లు రావడానికి కృషి చేసిన ఎంపీని.. వైద్యులు సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details