ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండున్నరేళ్లలో విజయవంతంగా 300 గుండె ఆపరేషన్లు

రెండున్నరేళ్లలో 300 గుండె ఆపరేషన్లు చేసి చరిత్ర సృష్టించాడు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఎన్నో లక్షల వ్యయంతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ..పేదల గుండెలకు అభయానిచ్చారు. సీమ ప్రజలకు ఉచిత గుండె, ఊపిరితిత్తులు శస్త్ర చికిత్సలు చేయాలని భావించిన ఆయన తెదేపా ప్రభుత్వాన్ని ఒప్పించి..ఆసుపత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాన్ని 2016లో ఏర్పాటు చేశారు.

By

Published : May 18, 2019, 11:02 AM IST

రెండున్నరేళ్లలో విజయవంతంగా 300 గుండె ఆపరేషన్లు

రెండున్నరేళ్లలో విజయవంతంగా 300 గుండె ఆపరేషన్లు
పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యప్రదాయినిగా నిలుస్తోంది కర్నూలు సర్వజన వైద్యశాల. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా... అత్యాధునిక వైద్యసేవలు అందిస్తోంది. అత్యంత కష్టసాధ్యమైన గుండె, ఊపిరితిత్తుల ఆపరేషన్లను సైతం చేస్తూ... ఎందరికో జీవితాలు ప్రసాదిస్తోంది. అతి తక్కువ సమయంలోనే 300 ఆపరేషన్లు పూర్తి చేసుకున్న కార్డియో థొరాసిక్ విభాగంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
రెండున్నరేళ్లు..300 శస్త్ర చికిత్సలు
కర్నూలు సర్వజన వైద్యశాల....రాయలసీమ సహా తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల రోగులుకు వైద్య సేవలు అందిస్తున్న ఓ సంజీవని. గండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సలు చేయటంలో తనకు సాటి ఎవరూ లేరని నిరూపిస్తోంది. కార్డియో థొరాసిక్ విభాగం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్లలోనే..300 సర్జరీలు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇన్నీ ఆపరేషన్లు చేసింది కేవలం ఒకే ఒక్క వైద్యుడంటే అతిశయెక్తి కలుగక మానదు.
ప్రభుత్వాన్ని ఒప్పించి విభాగం ఏర్పాటు..
కర్నూలు సాధారణ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం మాత్రమే ఉండేది. ఇందులో స్టెంట్లు మాత్రమే వేసేవారు. బైపాస్ సర్జరీలు ఉండేవి కాదు. ఇలాంటి ఆపరేషన్ల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది.ఈ తరుణంలో విశాఖలో పనిచేస్తున్న గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి బదిలీపై కర్నూలు వచ్చారు. సీమ ప్రజలకు ఉచిత గండె, ఊపిరితిత్తులు శస్త్ర చికిత్సలు చేయాలని భావించిన ఆయన తెదేపా ప్రభుత్వాన్ని ఒప్పించి..ఆసుపత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాన్ని 2016లో ఏర్పాటు చేశారు .
అరుదైన శస్త్ర చికిత్సలు
ఎన్నో ప్రతికూలతల మధ్య విభాగంలో అరుదైన శస్త్రచికిత్సలు చేశారు వైద్య నిపుణులు ప్రభాకర్ రెడ్డి. గుండె కొట్టుకుంటుండగా ఆపరేషన్ చేయటం, చిన్న కోతతో సర్జరీ చేయటం, వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీలు, గుండె కవాటాల మార్పిడి, గుండెలోని రంధ్రాలను పూడ్చటం, హృదయంలోని కణితులు తొలగించటం, చిన్నపిల్లలకు సైతం గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నారు. లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నారు.
తాజాగా గుండె మార్పిడి శస్త్రచికిత్సల కోసం జీవన్ దాన్ అనుమతి కోరారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికే వైద్యుల బృందం 2సార్లు సీటీ విభాగాన్ని పరిశీలించారు. అనుమతి వచ్చిన వెంటనే... గుండె మార్పిడి చికిత్సలు సైతం నిర్వహించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details