కర్నూలు జిల్లా ఆదోనిలో ఫిజియో థెరపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని విట్టకిష్టప్ప నగర్లో ఈ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వైద్యుడు ఆడం అస్మిత్పై కొందరు దుండగులు బండ రాళ్లతో దాడి చేశారు. స్థానికులు ఆయనను ఆదోని ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. రెండు నెలల కిందట మహేశ్వరి అనే యువతిని, ఆడం అస్మిత్ ప్రేమవివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడం వల్ల తమ కుటుంబ సభ్యులే తన భర్తను హత్య చేశారని మృతుని భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో వైద్యుడి హత్య.. ప్రేమ వివాహమే ప్రాణం తీసిందా! - కర్నూలు వార్తలు
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణ హత్య జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వైద్యుడిపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందాడు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భర్తను, తమ తల్లిదండ్రులే హత్య చేయించారని మృతుని భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో వైద్యుడి హత్య