కర్నూలు జిల్లా నంద్యాలలో సీఐటీయూ నేతలు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన ఆందోళన 21వరోజు కొనసాగింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వాళ్లు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పచ్చటి పైర్లను నాశనం చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు. ఎంతో మందికి ఉపయోగపడే వ్యవసాయ పరిశోధన భూములను కాపాడుతూనే వైద్యకళాశాలను మరో చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్యకళాశాల వద్దు' - కర్నూలు జిల్లా తాజా వార్తలు
నంద్యాలలో సీఐటీయూ నేతలు, వ్యవసాయ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాలకు మరో చోట స్థలం కేటాయించాలని కోరారు.
వ్యవసాయ కార్మికులు చేపట్టిన ఆందోళన