కర్నూలు జిల్లా సిరివెళ్ల మండల కేంద్రాన్ని ఎస్పీ పకీరప్ప తనిఖీ చేశారు. సిరివెళ్లలో కరోనా పాజిటివ్ కేసులు 3 నమోదు కాగా.. మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతం నుంచి ప్రజలు బయటకు వెళ్ళటం కానీ.. ఇతర ప్రాంతాల నుంచి సిరివెళ్లకు రావటంగానీ పూర్తిగా అడ్డుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేయాలన్నారు.
సిరివెళ్లలో కఠినంగా లాక్ డౌన్ - సిరివెళ్లలో కరోనా పాజిటివ్ కేసులు మూడు బయటపడ్డాయి
సిరివెళ్ల మండల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పకీరప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్ డౌన్ అమలుపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు.

సిరివెళ్లలో జిల్లా ఎస్పీ పర్యటన