ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంకేతిక లోపంతో నగదు పంపిణీకి అంతరాయం - కర్నూలులో సాంకేతిక లోపంతో నగదు పంపిణీకి అంతరాయం

సాంకేతిక లోపంతో కర్నూలు జిల్లాలో వెయ్యి రూపాయల నగదు పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి సర్వర్ బిజీ ఉండటంతో లబ్ధిదారులకు నగదు పంపిణీకి ఆలస్యమవుతోంది.

నగదు పంపిణీకి అంతరాయం
నగదు పంపిణీకి అంతరాయం

By

Published : Apr 4, 2020, 3:12 PM IST

కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ విధించటంతో పేదలకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు నగదును ప్రకటించింది. నేటి నుంచి నగదు పంపిణీ చేస్తుండగా...సాంకేతిక లోపం కారణంగా కర్నూలు జిల్లాలో నగదు పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి సర్వర్ బిజీ ఉండటంతో నగదు పంపిణీ చేయలేకపోతున్నామని వార్డు వాలంటీర్లు వాపోతున్నారు. మరోవైపు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా రేషన్ దుకాణాలు సైతం మూతపడ్డాయి. నేటి నుంచి రేషన్ దుకాణాలు తెరవటంతో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రేషన్ తీసుకెళ్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details