మహిళల భద్రత కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్న 60 దిశా ద్విచక్ర వాహనాలను కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రారంభించారు. దిశా చట్టం ద్వారా మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలోని 60 పోలీసు స్టేషన్లకు 60 ద్విచక్రవాహనాలతో పాటు రెండు క్యూ ఆర్టీలు, ప్రత్యేక సదుపాయలు ఉన్న దిశా మిని వ్యాన్లను మహిళా పోలీసులకు అందజేశారు. మహిళ బాధితుల నుంచి సమాచారం తీసుకునేందుకు.. కేసుకు సంబంధించి గోప్యంగా విచారణ చేసేందుకు దిశా మిని వ్యాన్లో అన్ని సదుపాయాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.
దిశా వాహనాలను ప్రారంభించిన ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప - disha two wheelers latest news
మహిళల భద్రత కోసం కర్నూలు జిల్లాలోని 60 పోలీసు స్టేషన్లకు 60 ద్విచక్రవాహనాలతో పాటు రెండు క్యూ ఆర్టీలు, ప్రత్యేక సదుపాయలు ఉన్న దిశా మిని వ్యాన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రారంభించారు.
దిశా వాహనాలు ప్రారంభం