కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7కు చేరింది. మల్యాలకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి, నంద్యాలకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి, కోడుమూరుకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి కి పలుమార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. వారిని శాంతిరాం ఆసుపత్రి నుంచి అధికారులు ఇంటికి పంపించారు.
కరోనా నుంచి కోలుకున్న ముగ్గురు వ్యక్తుల డిశ్ఛార్జ్ - karnool upcoming news
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చి.. తర్వాత కోలుకున్న ముగ్గురు వ్యక్తులను డిశ్ఛార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరికి నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇంటికి పంపించామని వైద్యులు వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న ముగ్గురు వ్యక్తుల డిశ్ఛార్జ్