16 సినిమాలకు దర్శకత్వం వహించిన జి. నాగేశ్వరరెడ్డి సొంతూరైన కర్నూలు జిల్లా కోడుమూరులో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పనులు 40 శాతం పూర్తయ్యాయని, మరో రెండేళ్లలో నిర్మాణం పూర్తి కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం మహేశ్వరరెడ్డి, హనుమంత రెడ్డి, రాజశేఖర్, శ్రావణ్, సూర్యారెడ్డి తదితరులు శాలువాతో ఆయన్ని సన్మానించారు.
సొంతూరిలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి పర్యటన - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తాజా వార్తలు
కర్నూలు జిల్లా కోడుమూరులో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను దర్శకుడు నాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ఆలయ ఛైర్మన్ ఎద్దుల మహేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని నాగేశ్వరరెడ్డి తెలిపారు.
![సొంతూరిలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి పర్యటన Director Nageshwara Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6099330-486-6099330-1581922115711.jpg)
కోడుమూరులో సందడి చేసిన దర్శకుడు