ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BRIDGE: కర్నూలు - కల్లూరు మధ్య శిథిలావస్థకు చేరిన వంతెన..! - Vakkera brook bridge

BRIDGE: శిథిలావస్థకు చేరిన వంతెన.! ఇరువైపులా... రక్షణ గోడా లేదు.! ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. చిన్నపాటి వర్షం పడినా వంతెనపైకెక్కి నీరు పారుతుంది. కొత్తది నిర్మించాలని ఎన్నోఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇది కర్నూలు- కల్లూరు మధ్య ఉన్న వంతెన పరిస్థితి.. వాహనదారుల దుస్థితి

BRIDGE
వంతెన

By

Published : Oct 25, 2022, 1:59 PM IST

కర్నూలు-కల్లూరు మధ్య శిథిలావస్థకు చేరిన వంతెన

BRIDGE: కర్నూలు - కల్లూరు ప్రాంతాల మధ్యలో వక్కెర వాగుపై దశాబ్దాల క్రితం వంతెన నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరింది. రోడ్డు కూడా గుంతలమయంగా మారడంతో.. వాహనదారుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఆ ప్రాంత ప్రజలు కర్నూలుకు వెళ్లాలంటే అదొక్కటే మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వంతెన ఎత్తు తక్కువగా ఉండటంతో.. వర్షాకాలంలో వాగు ఉద్ధృతి పెరిగినప్పుడు పైనుంచే నీరు ప్రవహిస్తోంది. గుంతలు ఉండటం.. వరద నీరు చేరడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

కొత్త వంతెన నిర్మించాలని ఎన్నోఏళ్లుగా అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులూ ఇదే వంతెన పైనుంచి వెళ్తున్నారు గానీ.. వంతెన నిర్మాణంపై చొరవ చూపడం లేదని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తది నిర్మిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ఎలాంటి చలనమూ లేకపోవటంతో వామపక్షాలు స్థానికులతో కలిసి వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. వంతెన ఎత్తు పెంచాలని.. లేదంటే కొత్త వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details