ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి' - కర్నూలు తాజా న్యూస్​

కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనుకోవడం అనాలోచిత నిర్ణయమని పేర్కొన్నారు.

dharna to set up krishna river ownership board in kurnool district
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్​

By

Published : Jan 9, 2021, 10:42 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కృష్ణానదికి ఏ మాత్రం సంబంధం లేని విశాఖలో బోర్డును ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం భావించడం అనాలోచిత నిర్ణయమని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఆలయాలపై నిఘా పెంచాలి: ఎస్పీ ఫక్కీరప్ప

ABOUT THE AUTHOR

...view details