ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట మినీ ట్రక్కు యజమానుల ధర్నా - మినీ ట్రక్కు యజమానుల ఆందోళన తాజా న్యూస్

ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కష్టతరంగా మారిందని కర్నూలు నగరంలోని మినీ ట్రక్కు యజమానులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. డ్రైవర్​గా చేరిన తాము హమాలీ పని, ఈ పాస్ యంత్రాల నిర్వహణను చేయలేకపోతున్నామని వాపోయారు.

Dharna of mini truck owners distributing essential goods door to door in front of Kurnool Collectorate
కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన మినీ ట్రక్కు యజమానులు

By

Published : Feb 5, 2021, 4:36 PM IST

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కష్టతరంగా మారిందని కర్నూలు నగరంలోని మినీ ట్రక్కు యజమానులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. డ్రైవర్​గా చేరిన తాము.. హమాలీ పని, ఈ పాస్ యంత్రాల నిర్వహణ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల మూటలు మోయలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలలో ఏమీ మిగలకపోవడంతో.. ట్రక్కులను నిలిపివేస్తున్నట్లు ట్రక్కు యజమానులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు: జిల్లాలో 193కి 52 ఏకగ్రీవం

ABOUT THE AUTHOR

...view details