ఆన్లైన్లో రమ్మీ ఆటను రద్దు చేయాలని కర్నూల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ రమ్మీ ఆటను నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ రమ్మీని నిషేధించాలంటూ ధర్నా - ఆన్లైన్ రమ్మీ తాజా వార్తలు
అసలే లాక్డౌన్... ఖాళీగా ఉండే యువత ఊసుపోక ఆన్లైన్లో రమ్మీ ఆడేస్తున్నారని, ఈ ఆటకు బానిసలవుతున్నారని, ఆన్లైన్ రమ్మీని నిషేధించాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూల్లో ధర్నా చేపట్టారు.
Dharna for ban online rummy in kurnool district
లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న విద్యార్థులు, యువత ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తెలంగాణ, హర్యానా రాష్ట్రాలలో ఆన్లైన్ రమ్మీ ఆటను నిషేధించారని.... మన రాష్ట్రంలోనూ ఈ ఆటను నిషేధించాలని కోరారు.
ఇదీ చదవండి:శ్రీశైల ఆలయ కుంభకోణం: 24 మంది అరెస్ట్