దసరా నవరాత్రుల్లో పూజల్లో నిమగ్నమై ఉంటారనే ఉద్దేశంతో కర్నూలు మహిళలు ముందస్తుగా దాండియా ఆడి అలరించారు. వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారి శాలలో దాండియాను నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ మహిళా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ, నవరాత్రుల సమయంలో పూజల్లో నిమగ్నమై ఉంటారనే ఉద్దేశంతోనే ముందస్తుగా దాండియా నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాండియాలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
ముందస్తు దాండియా ఆడి అలరించిన మహిళలు - కర్నూలు
కర్నూలు జిల్లాలో దసరా సందర్భంగా ముందస్తుగా దాండియా ఆడి మహిళలు సందడి చేశారు.
దాండియాతో సందడి చేసిన మహిళలు
ఇదీ చదవండి : నంద్యాల డివిజన్ పరిధిలో భారీ వర్షం