శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 10 నుంచి 14 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. కర్ణాటక నుంచి భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు. వెంకటాపురం, బైర్లూటి, నాగలూటి, పెచ్చెరువు, భీముని కొలను ప్రాంతాల మీదుగా.. నల్లమల అడవుల్లో కన్నడ భక్తులు పాదయాత్ర చేసుకుంటూ.. కైలాస ద్వారం మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. కన్నడ యువకులు విభిన్న శైలిలో కాళ్లకు చెక్కలు కట్టుకుని పాదయాత్రగా వస్తుండడం విశేషం.
కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం... కర్నూలు సమీపంలోని వెంకాయిపల్లె వద్ద జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం వారు అన్నదానం ఏర్పాటుచేశారు. కరోనా కారణంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని, తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.