కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు శ్రీకారం చుట్టింది. రూ. పది లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆలయ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ఛైర్మన్ సుబ్బలక్ష్మయ్య భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్తోపాటు ట్రస్ట్ బోర్డుకు చెందిన మరో ముగ్గురు.... ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పునా విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయం చేసినట్లు వాళ్లు పేర్కొన్నారు.
ఆలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ - కర్నూలు నేటి వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు అధికారులు భూమిపూజ చేశారు. రూ. పది లక్షలతో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు ట్రస్ట్ బోర్డు పేర్కొంది.
శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ