ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమం పేరిట అభివృద్ధిని గాలికి వదిలేశారు'

తెదేపా సర్కార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తమ పనిగా వైకాపా నేతలు చెప్పడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తప్పుబట్టారు. ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణం తమ హయాంలో నిర్వహించినా.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అంటూ నేటికీ జగన్ సర్కార్ పనులు ప్రారంభించలేదన్నారు.

సంక్షేమం పేరిట అభివృద్ధిని గాలికి వదిలేశారు : బీవీ జయనాగేశ్వర రెడ్డి
సంక్షేమం పేరిట అభివృద్ధిని గాలికి వదిలేశారు : బీవీ జయనాగేశ్వర రెడ్డి

By

Published : Oct 6, 2020, 6:38 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

శాశ్వత తాగునీటి పథకం..

తమ ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పట్టణానికి తాగునీరు అందించేందుకు రూ.148 కోట్లతో శాశ్వత తాగునీటి పథకాన్ని రూపొందించామని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియ దశలో నిలిచిన పథకానికి భూమి పూజ చేసి తామే నూతనంగా తెచ్చినట్లు చెప్పడం భావ్యం కాదని బీవీ హితవు పలికారు.

రివర్స్ టెండరింగ్ ఏదీ ?

జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడైన ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణం తమ హయాంలో జరిగినా.. రివర్స్ టెండర్ అంటూ ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వ పనులు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరిట అభివృద్ధిని విస్మరించారని వెల్లడించారు.

ఇవీ చూడండి:

కర్ణాటకలో పర్మిట్ లేని ఆరెంజ్​ బస్సులు సీజ్

ABOUT THE AUTHOR

...view details