కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణ సమీపంలోని అవుకురోడ్డులో ఉన్న బాలనరసింహా రెడ్డి పాలీష్ పరిశ్రమ వద్ద డిటోనేటర్ పేలింది. షేక్ మహబూబ్ వలి అనే వ్యక్తి చెత్తకు నిప్పుపెట్టగా... అక్కడ పెద్ద శబ్దం వచ్చి అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని కొందరు కూలీలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్సై మహేష్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని విచారించారు. ఎవరో పాత డిటోనేటర్ అక్కడ ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితుడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు. పేలుడు విషయంపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.
డిటోనేటర్ పేలి ఒకరికి తీవ్ర గాయాలు - బనగానపల్లెలో చెత్తలో పేలిన డిటోనేటర్
చెత్తకు నిప్పుపెట్టగా ఆకస్మాత్తుగా ఓ డిటోనేటర్ పేలింది. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె ఆవుకు రోడ్డులో జరుగగా.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు.

ఆసుపత్రిలో బాధితుడు
TAGGED:
బనగానపల్లెలో పేలిన డిటోనేటర్