కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేయించారు. డీఎస్పీ వినోద్ కుమార్ సమక్షంలో 166 లీటర్ల సారాతో పాటు 423 టెట్రా బాటిల్స్‌ను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. సారా, అక్రమ మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు రోలర్‌తో అక్రమ మద్యం ధ్వంసం - ఆదోనిలో అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కివేత
ఆదోనిలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించారు. సారా, అక్రమ మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు.
ఆదోనిలో అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కివేత