శ్రీశైలంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రెండు వారాల నుంచి స్థానికులు భారీ సంఖ్యలో ఈ వ్యాధి బారినపడుతూ బాధపడుతున్నారు. డెంగీతో బాధపడుతున్న చిన్నారులు దేవస్థానం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది చిన్నారులు డెంగీ జ్వరాలతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలంలో జ్వరాలను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Dengue Fever: శ్రీశైలంలో విజృంభిస్తున్న డెంగీ జ్వరాలు..ఆందోళనలో జనాలు! - శ్రీశైలంలో డెంగ్యూ జ్వరాలు విజృంభణ
రాష్ట్రంలో ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..మరోవైపు డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. రెండు వారాలుగా శ్రీశైలంలోని ప్రజలు భారీ సంఖ్యలో డెంగీ బారినపడుతూ బాధపడుతున్నారు.

Dengue fevers