'రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుంది' - కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు న్యూస్
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు.
!['రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుంది' Demands by Kurnool Parliament Speaker Somishetti Venkateshwar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10654975-826-10654975-1613496614348.jpg)
'రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుంది'
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని తెదేపా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గతంలో తమ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పార్టీ అభ్యర్థులు దాడులు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.