యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల యాదవుల ప్రముఖులతో కర్నూలు నగరంలోని శ్రీ కృష్ణదేవాలయంలో రాజకీయ చైతన్య సమావేశం నిర్వహించారు.
'యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి'
రాయలసీమ జిల్లాల యాదవుల ప్రముఖులతో కర్నూలు నగరంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో రాజకీయ చైతన్య సమావేశం నిర్వహించారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు.
'యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్'
జనాభా లెక్కల ప్రకారం యాదవులకు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పదవులు ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఏపీలో జనాభా ఎక్కువగా ఉన్న తమకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. యాదవులకు రాజ్యసభ సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గ ఆమోదం