కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెకు చెందిన ఉప్పర లక్ష్మీదేవి మంగళవారం రాత్రి.. బిడ్డకు జన్మనిచ్చారు. ఒక్కరోజైనా గడవకముందే.. బుధవారం తమ పంచాయతీ అయిన కోతిరాళ్లలోని పోలింగ్ కేంద్రానికి బిడ్డతో సహా వచ్చి.. ఓటు వేశారు.
బాలింతరాలు అయినా.. బాధ్యత మరువలేదు - delivery lady votes update
బిడ్డతో వచ్చి ఓ అమ్మ ఓటు హక్కును వినియోగించుకుంది. ఇందులో కొత్త ఏముంది.. ప్రతి ఒక్కరూ చేసే పనేగా అని అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్లే..! ఎందుకుంటే.. ఆమె బిడ్డకు జన్మనిచ్చి... ఒక్క రోజైనా గడవకుండానే... పోలింగ్ కేంద్రానికి బిడ్డతో సహా వచ్చి ఓటు వేసింది.!
పురిటి బిడ్డతో ఓటు వేసిన బాలింతరాలు