ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిగ్రీ పరీక్ష రాసింది.. సర్పంచ్​గా ప్రమాణం చేసింది..! - ఆళ్లూరు తాజా వార్తలు

ఓ వైపు డిగ్రీ పరీక్షలు.. మరోవైపు సర్పంచిగా ప్రమాణ స్వీకారం.. రెండు కార్యాలను విజయవంతంగా పూర్తి చేసింది కర్నూలు జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన అవుకు చెంచమ్మ. ఆళ్లగడ్డలోని ఓ కళాశాలలో డిగ్రీ చదవుతున్న ఆమె.. పరీక్ష ముగించుకుని ప్రమాణ స్వీకారానికి హాజరైంది.

sarpanch oathing cermany
ఆలూరు డిగ్రీ పరీక్ష రాసి సర్పంచ్​గా ప్రమాణం

By

Published : Apr 3, 2021, 8:26 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆలూరు గ్రామానికి చెందిన అవుకు చెంచమ్మ డిగ్రీ పరీక్ష రాసిన అనంతరం సర్పంచ్​గా ప్రమాణ స్వీకారం చేశారు.

అవుకు చెంచమ్మ ఆళ్లగడ్డలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్​గా పోటీ చేసి గెలుపొందారు. డిగ్రీ పరీక్ష, సర్పంచ్ ప్రమాణ కార్యక్రమం ఒకేరోజు రాగా.. మొదట పరీక్షకు హాజరైన ఆమె.. తర్వాత సర్పంచ్​గా ప్రమాణం చేశారు. చదవుకుంటూనే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి:నేటితో ముగియనున్న 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు

ABOUT THE AUTHOR

...view details