కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాల పాడు గ్రామంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో జింకలు గ్రామాల పరిధిలోని పొలాల్లోకి వస్తుంటాయి. ఇలా వచ్చిన ఒక జింకల గుంపు పై కుక్కలు దాడి చేశాయి. అందులో ఒకటి కుక్కల చేతిలో మృతి చెందింది. జింక కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు.
కుక్కల దాడిలో జింక మృతి - kurnool district
కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాల పాడు గ్రామంలో జరిగింది.
![కుక్కల దాడిలో జింక మృతి kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8047559-533-8047559-1594890089626.jpg)
కుక్కల దాడిలో జింక మృతి