కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రెండు రోజులుగా తగ్గుతున్నాయి. ఆదివారం కొత్తగా 380 మందికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వైరస్ కారణంగా మరో నలుగురు మరణించారు. జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,386కు చేరింది. మరణాల సంఖ్య 395కు ఎగబాకింది. 42,194 మంది కోలుకున్నారు. 5,797 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో తగ్గిన కరోనా కేసులు... కొత్తగా 380 మందికి పాజిటివ్ - kurnool district news updates
జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా 380 మందికి కొవిడ్ నిర్ధారణ కాగా... మరో నలుగురు మృతిచెందారు.
కర్నూలు జిల్లాలో తగ్గిన కరోనా కేసులు