ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను దోచుకుంటున్న దళారులతో ఉల్లి సాగుకు మద్దతు ధర కరవు

Decreased Onion Price Today: సాగుకు నీరివ్వలేని వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. చేతికి వచ్చిన పంటకూ మద్దతు ధర కల్పించలేక పోతోంది. ఓవైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఘాటెక్కుతుంటే రైతులకు మాత్రం ఆ మేర ధర దక్కడం లేదు. కర్నూలు జిల్లా మార్కెట్‌ యార్డులోఉల్లి రైతుల కష్టాన్ని దళారులు దోచేస్తున్నారు. వ్యాపారులు, కొనుగోలు అధికారులు కుమ్మక్కై రైతుల్ని నట్టేట ముంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

Decreased_Onion_Price
Decreased_Onion_Price

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 9:05 AM IST

Decreased Onion Price Today: రైతులను దోచుకుంటున్న దళారులతో ఉల్లి సాగుకు మద్దతు ధర కరవు

Decreased Onion Price :తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు అలుముకున్న నేటి పరిస్థితుల్లో పంటలు పండటమే కష్టమైపోయింది. నీటి జాడ కానరావటం లేదు. వేసిన పంటలు చేతికి అందటం లేదు. ఈ తరుణంలోచేతికి వచ్చిన పంటలకు కనీస మద్దతు ధర సైతం రాకపోవటంతో రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల మోసాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కర్నూలు జిల్లా ఉల్లి రైతుల (Onion Farmer)పై కథనం..

Mediators Cheating Onion Farmers in Kurnool Market :తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లిని సాగు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది కరవు పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి ఆధారంగా వేసిన పంటలు సైతం చేతికి వచ్చే పరిస్థితులు కానరావటం లేదు. ఒకవేళ చేతికి వచ్చినా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జిల్లాలో ఉల్లి దిగుబడులు తగ్గిపోవటంతో వారం రోజులుగా ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర 100 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరిసింది. దిగుబడులు తగ్గినా మంచి ధరలు వస్తున్నాయని సంబరపడ్డారు. అంతలోనే ధరలు అమాంతం తగ్గిపోవటంతో రైతన్నలు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Onion Price Hike: ఉల్లి ధర డబుల్.. మొన్నటి దాకా వందకు మూడు కిలోలు.. ఇప్పుడు కిలో రూ.60పైనే..!

Farmers Problems in YSRCP Government :కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో నాలుగు రోజుల క్రితం క్వింటా ఉల్లి ధర గరిష్ఠంగా 5 వేలా 5 వందల రూపాయల వరకు పలికింది. మంచి ధరలు పలుకుతుండటంతో రైతన్నలు తాము పండించిన పంటను విపణికి తీసుకువస్తున్నారు. కానీ వ్యాపారులంతా కుమ్మక్కై ఒక్కసారిగా ధరలు తగ్గించి వేశారు. క్వింటా ఉల్లిపై 15 వందల నుంచి 2 వేల వరకు తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కనీసం ఉల్లిని కొనుగోలు చేయటానికి వ్యాపారులే ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ కొన్నా సరాసరిన 15 వందల నుంచి 2 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల కనీసంపెట్టుబడులు సైతం రావటం లేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కూలి ఖర్చులూ రావని లబోదిబోమంటున్నారు. అయినకాడికి అమ్ముకోలేక రైతులు దిగాలుపడిపోతున్నారు.

Onion Farmers Fire on YSRCP Government: ఉల్లి రైతుకు వెన్నుపోటు.. నష్టాలు భరించలేక రైతన్న అవస్థలు

Kurnool Onion Farmers Facing Problems With Low Price :కర్నూలు జిల్లాలో సాధారణ సాగు 15,483 హెక్టార్లు కాగా 16,865 హెక్టార్లు సాగైంది. నంద్యాల జిల్లాలో సాధారణ సాగు 4,073 హెక్టార్లు కాగా 3,252 హెక్టార్లు సాగైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయాయి. ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్​కు 9 వేల క్వింటాళ్ల వరకు సరుకు వస్తోంది. నాణ్యమైన ఉల్లికి సైతం ధరలు పలకటం లేదని రైతన్నలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్​లో కిలో ఉల్లి 70 నుంచి 100 రూపాయల వరకు పలుకుతుండటం గమనర్హం.

ఆత్మహత్యలే శరణ్యం :ప్రభుత్వం తమను గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని లేదంటే.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వేడుకుంటున్నారు.

Onion farmers Problems: కర్షకులను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..!

ABOUT THE AUTHOR

...view details