Death Of Father: ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని అందరిలాగా కలలు కన్నాడు. తన కుమారుడి పెళ్లి గురించి చుట్టూ పక్కల గ్రామాల వారు గొప్పగా మాట్లాడు కోవాలనుకున్నాడు. తన కుమారుడి కొత్త జీవితానికి తొలి అడుగులోనే అంత విచారం చోటుచోసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కుమరుడి నిశ్చితార్థం అయిన వెంటనే ఆయన మృతి చెందిన దుర్ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ కుటుంబంలో నిశ్చితార్ధ శుభగడియలు.. అంతలోనే ఇంటియజమాని గుండెపోటుతో మృతి - ఆంధ్ర తాజా వార్తలు
Death Of Father: నూతన జీవితానికి నాంది పలికిన ఆనంద సమయంలో వారి గుండె ఒక్కసారిగా బరువైపోయింది. ఆ వార్త విన్న వారు ఎలా స్పందించాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఓ వైపు సంతోషం మరోవైపు దుఃఖం నడుమ అల్లాడిపోయింది ఆ కుటుంబం.
ఏమీ జరిగింది: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సూగూరులో ఏకైక కుమారుడి మల్లేష్ నిశ్చితార్థం జరిగిన వెంటనే తండ్రి ధర్మన్న(50) మృతి చెందాడు. ధర్మన్నకు కుమారుడు ఇద్దరు కూతుర్లు సంతానం. ధర్మన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడి నిశ్చితార్థం తమ గ్రామ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మాయి గ్రామంలో నిశ్చితార్థం కార్యక్రమం జరుగింది. అనారోగ్యం కారణంగా ధర్మన్న ఇంటి దగ్గర ఉండి కుటుంబ సభ్యులను బంధువులను శుభకార్యానికి పంపించాడు. నిశ్చితార్థంలో కాబోయే వధూవరులు పూలమాలలు మార్చుకునే కార్యక్రమం అవగానే ధర్మన్న మృతి చెందడన్న సమాచారంతో అప్పటి వరకు కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో సందడిగా ఉన్న నిశ్చితార్థం కార్యక్రమంలో విషాధచాయలు నెలకొన్నాయి.
ఇవీ చదవండి