కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటకు చెందిన ప్రభాకర్ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుర్తించిన స్థానికులు అతన్ని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్తీ కల్లు తాగడం వల్లే ప్రభాకర్ మరణించాడని బంధువులు ఆరోపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రాలయంలో కల్లు తాగి యువకుడి మృతి - కర్నూలు జిల్లాలో నేరాలు
కల్లు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా కల్లుదేవకుంటలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![మంత్రాలయంలో కల్లు తాగి యువకుడి మృతి Death of a drunken teenager in kalludhevakunta kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7144596-842-7144596-1589130753114.jpg)
కల్లు తాగి యువకుడి మృతి