కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి 2001లో హసీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ళ తర్వాత జరిగిన ఓ ప్రమాదంలో అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో అతని ఆస్తిని భార్య రాయించుకుంది. భార్య, భర్తకు మనస్పర్థలు రావడంతో అయిదేళ్లుగా వారిద్దరు విడివిడిగా ఉంటున్నారు. భర్త ఆస్తిని తమ పేరున మార్పించుకునే క్రమంలో... భార్య హసీనా తన భర్త చనిపోయినట్లు చెప్పి అత్త రమాదేవితో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు.
బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం జారీ
ఆస్తి కోసం బతికున్న భర్తను ప్రభుత్వ రికార్జుల ప్రకారం చంపేసిందో భార్య. తన భర్త చనిపోయాడని అత్త గారిని మభ్యపెట్టి ఆమెతోనే మరణ ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేయించింది. తీరా విషయం తెలుసుకున్న బాధితుడు అధికారులను ప్రశ్నిస్తే అసలు విషయం బయటకు వచ్చింది.
బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం జారీ
ఆ మేరకు అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ విషయాన్ని ఇటీవల తెలుసుకున్న రవి కుమార్ అధికారుల తీరును తప్పుపట్టారు. ఆస్తి కోసం భార్య ఇలా చేయడం దారుణమని రవికుమార్ వాపోయారు. కాగా దరఖాస్తు చేసిన రవి కుమార్ తల్లి రమాదేవి ఇటీవల మృతి చెందింది. అలాగే మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వక ముందు విచారణ జరిపిన వీఆర్ఓ కూడా కొన్ని రోజుల కిందట మృతిచెందాడు.
ఇదీ చదవండి :రేషన్ బియ్యం పట్టివేత.. అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తి అరెస్ట్