వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన కర్నూలులో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఐజ మండల కేంద్రానికి చెందిన జంగం రాచయ్య ఆనారోగ్యంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స చేయ్యాలని కోరగా వైద్యులు సత్వరం స్పందించలేదు. రోగిని పట్టించుకోకపోగా అసభ్యపదజాలంతో దూషించారని మృతుని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది క్షమాపణలు చెప్పాలని మృతదేహంతో ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. వైద్యులు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆందోళన విరమించారు.
వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన - కర్నూలులో ఆసుపత్రి ముందు నిరసన
చికిత్స ఆలస్యం కావడం వల్లే వ్యక్తి మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రోగి పట్ల వైద్యులు వ్యవహరించిన తీరుపై ఆసుపత్రి ముందే బైఠాయించారు.

మృతుని కుటుంబీకుల ఆందోళనtives protest