కర్నూలు బుధవారపేటకు చెందిన వ్యక్తి ఈనెల 6న అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతి చెందారు. ఆయాసం ఉండటంతో కరోనా పరీక్షలు చేసి వైద్యులు మృతదేహాన్ని తరలించారు. సదరు వ్యక్తికి పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మృతదేహాన్ని తీసుకువెళ్లాలని బంధువులకు ఆసుపత్రి అధికారులు సమాచారం ఇచ్చారు. మార్చురీకి వెళ్తే అక్కడ మృతదేహం కన్పించలేదు. ఏం జరిగిందని వాకబు చేస్తే మరో వ్యక్తి కరోనా పాజిటివ్‌తో మృతి చెందారని, ఆ వ్యక్తి మృతదేహంగా భావించి ఖననం చేశారని తేలింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృతదేహం మాత్రం మార్చురీలోనే ఉంది. మృతదేహాన్ని తారుమారు చేసి నెగెటివ్ రిపోర్టు వచ్చిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడం పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా ఇలా జరిగిందని బంధువులు వాగ్వాదానికి దిగారు.