కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పాతపేటలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణంతో గురువారం జరగాల్సిన కుమార్తె వివాహం ఆగిపోయింది.
గుండెపోటుతో తండ్రి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి - daughters marriage stopped at dond
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడా తండ్రి. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఏ ఆంటంకం రాకుండా విహహం జరిపించాలనుకున్నాడు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి.
![గుండెపోటుతో తండ్రి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి father died before daughter marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7557759-520-7557759-1591788299878.jpg)
గుండెపోటుతో తండ్రి మృతి.. ఆగిన కూతురి పెళ్లి
రాజ కుల్లాయప్ప ఎల్ఐసీ, అగ్రిగోల్డ్ ఏజెంట్గా పని చేసేవారు. అగ్రిగోల్డ్ ఏజెంట్గా 15 సంవత్సరాలు పని చేసి సంస్థకు ఖాతాదారుల నుంచి నాలుగు కోట్ల రూపాయలు కట్టించాడు. తమ డబ్బులు చెల్లించాలని ఖాతాదారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన కుల్లాయప్ప తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. రేపు జరగాల్సిన కుమార్తె వివాహం ఆగిపోయింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం
Last Updated : Jun 10, 2020, 5:10 PM IST