శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఇల కైలాసాన్ని తలపిస్తున్నాయి. శ్రీ భ్రమరాంబ దేవి.. భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై ప్రతిష్ఠించి ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగించారు. దేవస్థానం ఈవో రామారావు చేతుల మీదుగా ఉత్సవమూర్తుల ఎదుట అఖండ జ్యోతిని ప్రదర్శించారు. సాంస్కృతిక కళాకారుల ఖడ్గ విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
శ్రీశైలంలో ఘనంగా దసరా ఉత్సవాలు - srisailam latest updates
కర్నూలు జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల రెండో రోజు శ్రీ భ్రమరాంబ దేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
![శ్రీశైలంలో ఘనంగా దసరా ఉత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4610073-802-4610073-1569908245987.jpg)
శ్రీశైలంలో ఘనంగా దసరా ఉత్సవాలు