ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 6:45 AM IST

ETV Bharat / state

దసరా ఉత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలకు అన్నీ ఏర్పాట్లు జరిగాయి. ఈ రోజు అంకురార్పణ పూజలు చేయనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది.

dasara arrangements
దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీశైలంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం దసరా మహోత్సవాలకు ముస్తాబయింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈరోజు ఉదయం 8.30 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు చేస్తామని ప్రధాన అర్చకులు తెలిపారు.

సాయంత్రం శ్రీ భ్రమరాంబ దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని పూజారులు తెలిపారు. కొవిడ్ నిబంధనల కారణంగా గ్రామోత్సవం రద్దు చేశామని చెప్పారు. స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించి ఆలయ ఉత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు దూరం పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని అర్చకులు, అధికారులు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద..లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details