కర్నూలు నగరంలోని పలు కాలనీలకు వారం రోజులైనా తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని రెండవ వార్డుకు చెందిన స్థానికులు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ఇంటిని ముట్టడించారు. కమిషనర్ తో వాగ్వవాదానికి దిగారు. స్పందించిన కమిషనర్ వరద నీరు కారణంగా శుద్ది చేయడానికి సమయం పడుతోందని అందువలనే నీటి సరఫరా ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నా ఒక్కరు కూడా సమస్యను పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.
సాగునీరెటూ లేదు..తాగునీరైనా ఇవ్వండి సార్! - kurnool
ఓ వైపు వరద నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, కర్నూలు జిల్లాలో నీటి కటకటతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. సాగునీరు ఇవ్వలేకపోయిన అధికార్లు, కనీసం తాగునీరైన ఇవ్వాలని నగర వాసులు కమిషనర్ ఇంటిని ముట్టడించారు.
సాగునీరెటూ లేదు.. తాగునీరైనా ఇవ్వండి సార్...!