పింఛన్ల కోసం.. డప్పు కళాకారుల నిరసన - తుంగభద్ర నదీ పుష్కరాలకు డప్పుకళాకారుల ప్రదర్శన
కర్నూలు జిల్లాలో డప్పు కళాకారులు నిరసన చేపట్టారు. తమకు పింఛన్లు అందడం లేదని, నిధులున్నా కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర నదీ పుష్కరాల్లో.. డప్పుకళాకారుల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో డప్పు కళాకారుల నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు డప్పు కళాకారులు నిరసన చేశారు. ఈనెల 20 నుంచి జరగనున్న తుంగభద్ర నదీ పుష్కరాల్లో డప్పు కళాకారుల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని కోరారు. నిధులు ఉన్నా అధికారులు కేటాయించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.