శ్రీశైలం ఆలయానికి వాయువ్య భాగంలో 8, 9 శతాబ్దాలకు చెందిన పంచ మఠాలు ఉన్నాయి. ఈ మఠాలు ప్రాచీన కాలంలో ఆధ్యాత్మిక, విద్యాకేంద్రాలుగా విరాజిల్లాయి. ఈ క్రమంలో వీటిని పరిరక్షించుకోవాలన్న తలంపుతో.. మూడేళ్ల నుంచి పంచమఠాల జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ పనుల్లో భాగంగా.. ఎన్నో తామ్ర శాసనాలు, బంగారు వెండి నాణేలు, వస్తువులు లభ్యమయ్యాయి. తాజాగా రుద్రాక్ష మఠం మండపం ఉత్తర భాగంలో బండ పరుపుపై ప్రాచీనకాలం నాటి చిత్రలిపి శాసనాలు బయటపడ్డాయి.
శిథిలావస్థలో పంచమఠాలు.. పరిరక్షణకు స్థానికుల వేడుకోలు - srisailam latest news
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. శ్రీగిరి క్షేత్రంలో ఎన్నో ప్రాచీన మండపాలు, శాసనాలు నిక్షిప్తమై ఉన్నాయి. తాజాగా వందల ఏళ్లనాటి పురాతన మండపం వద్ద చిత్రలిపి శాసనాలు లభ్యం కావడం విశేషం. కానీ నానాటికి ఉనికి కోల్పోతున్న వీటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.
శ్రీశైలంలో శాసనాలు లభ్యం
లభ్యమైన శాసనాలను దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు, స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ పీఠం ఆచార్యులు చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించి, ఇవి 2,500 నుంచి 3,700 కాలం నాటివని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ శాసనాలు వెలుగుచూసిన ప్రదేశం శిథిలావస్థలో ఉంది. ఈ ప్రాచీన మండపం పునాదుల వరకు మట్టిని తొలగిస్తే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. చిత్రలిపి శాసనాలు లభ్యమైన రుద్రాక్ష మఠం మండపాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి