ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలివాన బీభత్సం.. పంట నష్టం.. పర్యటించిన ఎమ్మెల్యే - crop damage due to rain in kurnool

గాలివానతో కర్నూలు జిల్లా రుద్రవరం పరిధిలో పంట నష్టం వాటిల్లింది. ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. రైతులకు తప్పక పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

kurnool district
గాలివాన బీభత్సం.. పంట నష్టం

By

Published : Jun 1, 2020, 5:19 PM IST

కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని ఆలమూరు నరసాపురం గ్రామాల్లో గాలివానతో 150 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో బొప్పాయి, 10 ఎకరాలలో తమల పాకు తోటలు నేలకొరిగాయి. పంట నష్టం వివరాలు తెలుసుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఈ గ్రామాల్లో పర్యటించారు. ఉద్యానవ శాఖ అధికారులతో కలిసి పంట నష్టం అంచనా వేశారు. పంట నష్టం వివరాలు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి వస్తున్న దశలో ఒక గాలివాన దెబ్బతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులకు తప్పక పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details