ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా రెండో దశను ఎదుర్కోవడంలో మోదీ, జగన్ ప్రభుత్వాలు విఫలం' - corona second wave news

వాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా రెండో దశను ఎదుర్కోవడంలో మోదీ, జగన్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు.

cpm madhu
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

By

Published : Jun 9, 2021, 3:48 PM IST

కరోనా రెండో దశను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. వాక్సినేషన్ ప్రక్రియ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం సరికాదని కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. కరోనాను అరికట్టాలంటే లాక్ డౌన్​తో పాటు ప్రజలందరికి ప్రభుత్వమే ఉచితంగా వాక్సిన్ ఇవ్వాలని ఆయన సూచించారు.

గంగవరం పోర్టును అదానీకి అప్పగించడం సరికాదని.. క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఆస్తి, ఇతర పన్నులు పెంచడం తగదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details