ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ఫ్లైఓవర్​ నిర్మించాలని సీపీఎం నిరసన - కర్నూలులో సీపీఎం నిరసన

ఫ్లైఓవర్​ను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సీపీఎం రెండురోజుల నిరసన కార్యక్రమం చేపట్టింది. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నందున ప్రజా ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

కర్నూలులో ఫ్లైఓవర్​ నిర్మించాలని సీపీఎం నిరసన
కర్నూలులో ఫ్లైఓవర్​ నిర్మించాలని సీపీఎం నిరసన

By

Published : Nov 3, 2020, 5:31 PM IST

కర్నూలులోని కృష్ణనగర్ వద్ద ఫ్లైఓవర్​ను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి వంతెన నిర్మాణం చేపట్టాలని పోరాటం చేస్తున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణానికి అనుమతి వచ్చిందని...నిర్మాణం చేపడతామని స్థానిక ఎమ్మెల్యే చెప్పి సంవత్సరం అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details