పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కర్నూలులో సీపీఎం ఆధ్యర్యంలో ధర్నా చేపట్టారు. నగరంలోని విద్యుత్ భవన్ ముందు చేపట్టిన ధర్నాలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు యం.ఏ. గఫూర్ పాల్గొన్నారు. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో లాక్డౌన్ అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజల వద్ద డబ్బు లేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ చార్జీలు పెంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు.