ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 నుంచి సీపీఎం నిరసన - కొవిడ్​పై సీపీఎం వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఎం తెలిపింది. ఈనెల 20 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

cpm on covid in kurnool district
ఈనెల 20 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు

By

Published : Aug 17, 2020, 3:16 PM IST

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఎం ప్రకటించింది. కర్నూలులోని సుందరయ్య భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. లాక్ డౌన్ సమయంలో మహిళలపై దాడులు, గృహ హింస పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా... ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7,500, 10 కిలోల బియ్యం 6 నెలలపాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సీపీఎం నాయకుడు షడ్రక్ కు సంతాప సభ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details