ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ సీపీఎం నిరసన - రోడ్ల మరమ్మతుకు ఆదోని సీపీఎం ఆందోళనలు

అధ్వాన్నంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాస్తారోకో నిర్వహించారు. కొత్త రహదారులు వేయకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

cpm protest for roads repair
రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నేతలు

By

Published : Nov 17, 2020, 3:30 PM IST

దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం నేతలు రాస్తారోకో చేశారు. పట్టణానికి వచ్చే, గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వాన్నంగా తయారై.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త రోడ్లు వేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని .. ఆ పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details