తెదేపా పాలనలో అమృత్ పథకం కింద పేదలకు మంచినీటి కుళాయి కనెక్షన్ ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిపై పన్నులు విధించటాన్ని సీపీఎం నాయకులు వ్యతిరేకించారు. వైకాపా పాలనలో కుళాయి కనెక్షన్ తీసుకున్న వారికి వేల రూపాయల్లో బకాయిలు ఉన్నట్లు నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు ఇస్తున్నారన్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలపై భారం పడేలా పన్నులు పెంచుతూ.. తుగ్లక్ కంటే హీనంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు.
'మంచినీటి కుళాయి కనెక్షన్పై పన్నులు విధించకూడదు' - cpm leaders comments on taxes news
తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా అందించిన వాటిపై ప్రస్తుత ప్రభుత్వం పన్నులు విధించటం సరైంది కాదని సీపీఎం నాయకులు కర్నూలులో అన్నారు. ప్రజలు నివాసాలు వదిలి చెట్ల కింద జీవించే విధంగా వైకాపా పాలన సాగుతుందని విమర్శించారు.
సీపీఎం నాయకులు